తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్త్రీగా మారదామనుకున్న యువకుడు.. సర్జరీకి డబ్బుల్లేక ఆత్మహత్య - గువహటి న్యూస్

లింగమార్పిడి చేసుకుందామని సర్జరీకి డబ్బుల్లేక ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసోం గువాహటిలో ఈ ఘటన జరిగింది.

Boy who wants to change sex commits suicide
స్త్రీగా మారదామనుకున్న యువకుడు.. సర్జరీకి డబ్బుల్లేక ఆత్మహత్య

By

Published : Oct 27, 2021, 10:44 PM IST

లింగమార్పిడి చేసుకుందామనుకున్న ఓ యువకుడు సర్జరీకి డబ్బులు సర్దుబాటు గాక ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు ఉండే ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసోంలోని గువాహటిలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. యువకుడు గంటలపాటు తలుపులు తెరవకపోవడం వల్ల అనుమానం వచ్చిన పొరుగింటి వారు వెళ్లి చూస్తే అతడు విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.

నూన్​మాటి పోలీస్​ స్టేషన్ పరిధిలోని నరేంగి హౌసింగ్ కాలనీలో ఉంటున్న ఈ యువకుడి పేరు జావెద్ అశ్రఫుల్​​. చాలా కాలంగా లింగ మార్పిడి చేసుకోవాలనుకుంటున్నాడు. తన పేరును కూడా జావిన్ అఛారియాగా మార్చుకున్నాడు. సర్జరీ కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు.

జావెద్ లింగమార్పిడికి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని బంధువులు వెల్లడించారు. సర్జరీ కోసం వారు స్థిరాస్తిని అమ్మేందుకు కూడా సిద్ధపడ్డారని పేర్కొన్నారు.

సర్జరీకి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని, అవి తాను సమకూర్చుకోలేకపోతున్నాననే మనస్తాపంతోనే జావెద్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు.

పోలీసులు జావెద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యపై మాట్లాడేందుకు నిరాకరించారు.

ఇదీ చదవండి:12 కుటుంబాల గ్రామ బహిష్కరణ- ఆపై రాళ్ల దాడి!

ABOUT THE AUTHOR

...view details