తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సలసల కాగే నీటిలో బుడ్డోడు.. ఆశ్చర్యంలో నెటిజన్లు! - వైరల్ వీడియో

ఓ బాలుడు కడాయిలో కూర్చొని ఉండగా కింద మంటపెట్టారు. కడాయిలో నీరు మరుగుతున్నా.. ఆ బాలుడు ఏ మాత్రం చలించకుండా కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

boy sitting in boiling water
బాలుడు

By

Published : Sep 8, 2021, 1:23 PM IST

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే.. ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే. భూమి మీద ఎక్కడ ఏం జరిగినా అది మన కళ్ల ముందుకు వచ్చేస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ఓపెన్ చేస్తే చాలు.. నిత్యం రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఆ వీడియోలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించినా చాలు.. క్షణాల్లో వైరల్ అయిపోతాయి. అలాగే ఈ వైరల్ వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే మనం ఎన్నో వింతైన వీడియోలు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ వీడియో కూడా అలాంటిదే.. మాములుగా మన మీద వేడి నీళ్లు కొంచెం పడితేనే తట్టుకోలేక గంతులు వేస్తాం.. కానీ ఇక్కడ ఈ బుడతడు సలసల కాగుతున్న నీటిలో ఇలా జలకాలాడుతున్నాడు.

బాలుడు ఓ కడాయిలో కూర్చొని ఉండగా కింద మంట పెట్టారు. ఆ కడాయిలో నీరు మరుగుతున్నా.. ఆ బాలుడు ఏమాత్రం చలించకుండా కూర్చొని ఉన్నాడు. దాంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వీడియో ఫేక్ అంటున్నారు కొందరు నెటిజన్లు. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్.. జనాలను బుడ్డోడు మోసం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియా ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్‌గా మారింది.

ABOUT THE AUTHOR

...view details