తెలంగాణ

telangana

ETV Bharat / bharat

14 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ఫ్రెండ్స్.. కాళ్లు, చేతులు నరికి... - హత్య

Boy killed by his friends: చిన్న గొడవకే.. 14 ఏళ్ల బాలుడిని తన స్నేహితులే దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. కాళ్లు, చేతులు నరికి అడవిలో పడేశారు. ఈ ఘటన ఝార్ఖండ్​, దేవఘర్​ జిల్లాలో జరిగింది.

boy killed by friends
14 ఏళ్ల బాలుడిని హత్య చేసిన స్నేహితులు

By

Published : Dec 23, 2021, 12:59 PM IST

Updated : Dec 23, 2021, 1:07 PM IST

Boy killed by his friends: ఝార్ఘండ్​లోని దేవ​ఘర్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 14 ఏళ్ల బాలుడిని అతని స్నేహితులే అతికిరాతకంగా హత్య చేశారు. కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని సంచుల్లో పెట్టి అటవీ ప్రాంతంలో పడేశారు.

మంగళవారం రాత్రి బాలుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆ మరుసటి రోజున ఫిర్యాదు చేశారు. బాలుడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్లు సబ్​ డివిజనల్​ పోలీస్​ అధికారి పవన్​ కుమార్​ తెలిపారు.

ఏం జరిగింది..?

జసిది పోలీస్​ స్టేషన్​ పరిధి, రోహిణి గ్రామంలోని తన నివాసంలో బాధితుడిని అతని స్నేహితుడు(14) మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కలిశాడు. ఇద్దరు కలిసి కుమ్రాబాద్​ స్టేషన్​ రోడ్​కు వెళ్లారు. అక్కడ వారిని అవినాశ్​(19)అనే మరో స్నేహితుడు కలిశాడు. ముగ్గురు కలిసి.. పలంగా పహాడ్​ అటవీ ప్రాంతం వైపుగా వెళ్లారు. అక్కడే అవినాశ్​కు, బాధితుడికి మధ్య గొడవ జరిగింది.

గొడవ జరుగుతున్న క్రమంలోనే అవినాశ్​ తన వద్ద ఉన్న పదునైన కత్తిని తీసి బాధితుడిని పొడిచాడు. గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత.. కాళ్లు, చేతులు నరికి.. శరీర భాగాలను మూడు సంచుల్లో పెట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అవినాశ్​ను అరెస్ట్​ చేశారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. రక్తంతో తడిసిన కత్తి, బాధితుడి మొబైల్​ ఫోన్​ సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారతీయ శిక్షా స్మృతిలోని 302, 201, 120బీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:పెళ్లి కాకుండానే తల్లైన యువతి.. బిడ్డ పుట్టగానే హత్య చేసి..

Last Updated : Dec 23, 2021, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details