Boy Friend On Rent Bihar: ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు 'వాలెంటైన్స్ వీక్'ను జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో బిహార్, దర్భంగాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రియాన్షు మాత్రం 'అద్దెకు బాయ్‌ఫ్రెండ్' అనే ప్లకార్డుతో వీధి వీధి తిరుగుతూ ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ విధంగా ప్రేమ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. నగరంలోని రాజ్‌కోట్, చర్చి, దర్భంగా టవర్, బిగ్‌బజార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్లకార్డును ప్రదర్శిస్తున్నాడు ప్రియాన్షు.
దర్భంగా ఇంజినీరింగ్ కాలేజీలో ఐదో సెమిస్టర్ చదువుతున్న ప్రియాన్షు.. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా.. 'ఫ్రీ హగ్' పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ ప్రోగ్రాంకు విపరీతమైన ఆదరణ ఏర్పడింది. చాలా మంది నుంచి ప్రశంసలు దక్కాయి.