Boy Died Due to Electric Shock: పల్నాడు జిల్లాలో సంభవించిన రెండు ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. రెండు ఘటనలూ వినాయకుడి నిమజ్జనం కోసం.. ఉత్సాహంతో సంబరాలు జరుపుకుంటుండగా.. ప్రాణాలు తీసిన ఘటనలే కావటంతో.. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అందులో ఒకటి వినాయకుడి నిమజ్జనం కోసమని వెళ్లిన వారిలో ముగ్గురు నీటిలో గల్లంతై.. ఇద్దరు విగతా జీవులుగా దర్శనమిచ్చిన ఘటన ఒకటైతే. వినాయకుడి ఊరేగింపు చూడటానికి వెళ్లి విద్యుత్ ప్రమాదానికి గురై ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరొకటి.
వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి గల్లంతు..పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు పరిధిలో వినాయకుడి నిమజ్జనానికని వెళ్లి ముగ్గురు గల్లంతైన ఘటన కలకలం సృష్టించింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ముఖేష్ అనే వ్యక్తి.. నాదెండ్ల మండలం గణపవరంలోని ఓ టెక్స్‌టైల్స్‌లో పనిచేస్తున్నాడు. అతడు తన ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజలు చేసుకుంటున్నాడు. అతని స్వగ్రామంలో తల్లి మృతి చెందటంతో.. వినాయకుడి విగ్రహన్ని నిమజ్జనం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో అతనితో ఉంటున్న మరో ఇద్దరు కార్మికులు ప్రవీణ్ రాజ్ (మార్కాపురం), వసంత కుమార్ (శ్రీకాకుళం) తీసుకుని.. గణపవరం నుంచి వేలూరు వెళ్లే మార్గంలో ఉన్న పద్మనాభ కుంట దగ్గరకు వెళ్లాడు.
కొవ్వూరులో విషాదం.. గోదావరి ప్రవాహంలో భర్త గల్లంతు.. సురక్షితంగా ఒడ్డుకు భార్య
సోమవారం రాత్రి 7గంటలకు పద్మనాభ కుంట దగ్గరకు చేరుకోగా.. కుంటలోకి ముగ్గురు కార్మికులు దిగారు. నిమజ్జనానికి వెళ్లిన వారు ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాకపోవటంతో.. వసంత తండ్రి వెతుక్కుంటూ కుంట దగ్గరికి వెళ్లాడు. కుంట దగ్గర ముగ్గురు చెప్పులు విడిచి ఉండటంతో.. వారు చెరువులోకి దిగారని భావించి స్థానికులకు జరిగిందంతా వివరించాడు. దీంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటనపై సమాచారం అందుకున్న చిలకలూరిపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. కుంటలో గల్లంతైన వారి కోసం వెతుకుతుండగా.. అర్థరాత్రి సమయంలో ప్రవీణ్ రాజు మృతదేహం లభ్యం కాగా.. గాలింపు చర్యలు అలాగే కొనసాగించారు. మంగళవారం ఉదయం ముఖేష్ మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. మరో వ్యక్తి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అందుకు గాజ ఈతగాళ్లను రప్పించి వెతికేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.