ఝార్ఖండ్లో ఘోరం జరిగింది. మైనర్ ప్రియురాలిని దారుణంగా కొట్టి చంపాడు ఓ బాలుడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. సిమ్‌డేగా జిల్లాలోని బానో పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్కడియుల్ పంచాయతీలో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు.
మైనర్ ప్రియురాలిని దారుణంగా కొట్టి చంపిన బాలుడు.. మృతదేహాన్ని మురికి కాలువలో పడేసి.. - IIT Hyderabad student died in Jharkhand
మైనర్ ప్రియురాలిపై విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు ఓ బాలుడు. అనంతరం ఓ మురికి కాలువలో మృతదేహాన్ని పడేశాడు. ఈ ఘటన ఝార్ఖండ్లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పరిధిలో ఉన్న ఓ మురికి కాలువ వద్ద ఉన్న పొదల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు గ్రామస్థులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్మార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఘటనపై గ్రామస్థులు ఆందోళనలు చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ అధికారులను డిమాండ్ చేశారు.
ఝార్ఖండ్లో హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మృతి
హైదరాబాద్కు చెందిన ఐఐటీ విద్యార్థి చెరుకూరి ప్రవీణ్ ఉరివేసుకొని చనిపోయాడు. ఝార్ఖండ్ ధన్బాద్లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న ప్రవీణ్ మంగళవారం హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ అనంతరం అన్ని విషయాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు.