Free Bus Service in Delhi: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీలో మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఉచితం చేశారు. కానీ పురుషులకు ఈ ఆఫర్ లేదు. బస్సులో ఎలాగైనా ఉచితంగా ప్రయాణించాలనుకున్న ఓ యువకుడు లేడీ గెటప్‌తో బస్సు ఎక్కాడు. స్కార్ఫ్, మాస్కుతో మేనేజ్ చేద్దామని అనుకున్నాడు. కానీ కండక్టరుకు అనుమానం రావడం వల్ల అసలు విషయం బయటపడింది.
బస్సులో ఫ్రీ జర్నీ కోసం అమ్మాయిలా మారి..
Free Bus Service in Delhi: దిల్లీలో బస్సు సర్వీసులు మహిళలకు మాత్రమే ఉచితం. దీంతో ఆ ఆఫర్‌ను ఎలాగైనా వాడుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. అందుకే లేడీ గెటప్‌లో బస్సు ఎక్కాడు. కానీ చివరకు కండక్టర్‌కు దొరికిపోయాడు.
బస్సులో ఫ్రీ జర్నీ కోసం అమ్మాయిగా
మాస్కును తీసేందుకు మొదట నిరాకరించిన యువకుడు కండక్టర్‌ను క్షమాపణలు కోరాడు. అయితే కండక్టర్ అతనిపై సీరియస్ అవడం వల్ల చివరకు మాస్కును తొలగించాడు. అయితే దొరికిపోయాక కూడా అమ్మాయి గొంతుతోనే అతను మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కండక్టర్ తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది.
ఇదీ చూడండి :'వివాహం అంటే.. భార్యపై లైంగిక వేధింపులకు లైసెన్స్ పొందడం కాదు'