బోరుబావిలో పడిన చిన్నారిని వెలికితీసిన అధికారులు Borewell Baby Rescue Operation: మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పుర్ జిల్లా దౌనీ గ్రామంలో బోరుబావిలో పడిన దివ్యాన్షి కథ సుఖాంతమైంది. ఏడాదిన్నర వయసు ఉన్న ఈ చిన్నారిని అధికారులు సురక్షితంగా వెలుపలికి తీసుకొచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, సిబ్బంది బోరుబావిలోకి ఆక్సిజన్ పంపుతూ సహాయక చర్యలు కొనసాగించారు.
సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు దివ్యాన్షిని బోరుబావి నుంచి వెలికితీసిన అధికారులు చివరకు అధికారుల యత్నం ఫలించి చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగంతో పాటు ఆర్మీ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
చిన్నారిని అంబులెన్స్‌లో తరలిస్తున్నసిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్యాన్షి ఇదీ జరిగింది..
దివ్యాన్షి పొలంలో ఆడుకుంటుండగా అక్కడే తెరిచి ఉన్న ఓ బోరు బావిలోకి జారి పడింది. చిన్నారి ఏడుపు విని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను వెలికితీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడం వల్ల అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
చిన్నారి జారి పడిన ఈ బోరు ఎండిపోయి చాలా కాలం అయిందని.. దీని లోతు 15 అడుగులు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి :'అత్యాచారం అనివార్యమైతే.. ఆనందంగా ఆస్వాదించండి!'