A child named as a Border: భారత్-పాక్ సరిహద్దుల్లో పుట్టిన 'బార్డర్' అనే చిన్నారి కుటుంబానికి వీసా మంజూరైంది. దిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వారికి పాస్‌పోర్ట్‌ను జారీ చేసింది. పాక్ నుంచి భారత్‌లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి.. అనుకోకుండా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద చిక్కుకుపోయిన పాక్ హిందూ కుటుంబం ఎట్టకేలకు స్వదేశానికి చేరనుంది. ఈ చిన్నారి కుటుంబానికి దిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా మంజూరు చేసింది.
లాక్‌డౌన్‌తో సరిహద్దుల్లో ఇరుక్కుపోయి..
పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ దంపతులతో పాటు మరో 97 మంది పాకిస్థానీలు భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత కరోనా విజృంభించటం వల్ల లాక్డౌన్ విధించటం, పాక్ సరిహద్దులు మూసివేయడం సహా సరైన పత్రాలు లేకపోవటం వల్ల అట్టారీ-వాఘా సరిహద్దుల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న బలమ్ రామ్ అనే వ్యక్తి భార్య అయిన నింబు బాయి ఈ నెల 2న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కూలీ పనులకు వెళ్లిన ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా.. సమీప గ్రామాల ప్రజలు వచ్చి పురుడు పోశారు. వైద్య సహాయం అందించారు.
మరో పిల్లాడికి 'భారత్'గా నామకరణ