Booster Dose Covishield: కొవిషీల్డ్ తీసుకున్న వారు కొవావాక్స్ను బూస్టర్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిషీల్డ్‌కు కొవావాక్స్ మంచి బూస్టర్‌గా పనిచేస్తున్నట్లు వైరాలజిస్ట్ డాక్టర్ షహీద్ జమీల్ పేర్కొన్నారు. ఇతర వ్యాక్సిన్ కాంబినేషన్లపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదన్నారు.
మరో ప్రముఖ వైరాలిజిస్ట్ గగన్‌దీప్ కంగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత్‌లో ప్రస్తుతం మూడో డోసుకు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని.. కానీ యూకేకు చెందిన ఓ సంస్థ పరిశోధనలో కొవిషీల్డ్‌కు కొవావాక్స్ మెరుగైన బూస్టర్ అని తేలిందన్నారు.