కరోనా నియంత్రణకు 14 నెలల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మద్రాసు హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా బాధితులు తమిళనాడులో అనుభవిస్తున్న కష్టాలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన మద్రాసు హైకోర్టు సుమోటోగా గురువారం విచారణ చేపట్టింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తితో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్.శంకరనారాయణన్ న్యాయస్థానానికి హాజరయ్యారు. కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. కరోనా రెండో దశను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలను కేంద్రం ఎందుకు తీసుకోలేకపోయిందని ధర్మాసనం ప్రశ్నించింది.
కరోనా కట్టడి చర్యలపై కేంద్రానికి హైకోర్టు చురకలు! - మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం
కొవిడ్-19 నియంత్రణకు తమిళనాడు అనుసరిస్తున్న వైఖరిపై మద్రాసు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా రెండో దశను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలను కేంద్రం ఎందుకు తీసుకోలేకపోయిందని ధర్మాసనం ప్రశ్నించింది. మందులు, పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడేంతవరకు కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడింది.
మద్రాసు హైకోర్టు
మందులు, పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడేంతవరకు కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ధ్వజమెత్తింది. శుక్రవారం నాటికి తగిన సమాధానాలను కోర్టుకు అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి :కొవిడ్ సెంటర్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకారం