తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టైరు పేలి యాక్సిడెంట్ అయితే బీమా డబ్బులు ఇవ్వాలా?'.. హైకోర్టు కీలక తీర్పు - కారు టైర్ పేలడంపై బొంబాయి హైకోర్టు తీర్పు

కారు టైరు పేలడం మానవ నిర్లక్ష్యమేనని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసులో బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం చెల్లించాలని గతంలో ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది.

bombay high court on tyre burst case
bombay high court on tyre burst case

By

Published : Mar 12, 2023, 4:15 PM IST

టైరు పేలడం 'యాక్ట్ ఆఫ్ గాడ్​' కాదని.. అది పూర్తిగా మానవ నిర్లక్ష్యమేనని తీర్పునిచ్చింది బొంబాయి హైకోర్టు. కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంపై కోర్టును ఆశ్రయించిన ఇన్సూరెన్స్​ కంపెనీ పిటిషన్​ను విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మృతుడి కుటుంబానికి రూ.1.25 కోట్ల పరిహారం ఇవ్వాలని మోటార్​ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రైబ్యునల్​ ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ.. బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్​జీ డిగే ఏకసభ్య ధర్మాసనం.. ఇన్సూరెన్స్ కంపెనీ అప్పీలును తిరస్కరించింది.

మకరంద్​ పట్వర్ధన్​ అనే వ్యక్తి 2010లో తన స్నేహితులతో కలిసి పుణె నుంచి ముంబయికి వెళ్తున్నాడు. కారు యజమాని అయిన తన స్నేహితుడు.. మితిమీరిన వేగంతో నడిపాడు. ఫలితంగా వెనుక టైర్​ పేలిపోయి లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్ధన్​ అక్కడిక్కడే మరణించాడు. దీంతో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించగా.. వారు యాక్ట్​ ఆఫ్​ గాడ్​గా పరిగణిస్తూ పరిహారాన్ని తిరస్కరించారు. దీంతో బాధిత కుటుంబం ఇన్సూరెన్స్​ ట్రైబ్యునల్​ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన ట్రైబ్యునల్​.. మృతుడి ఆదాయంపైనే కుటంబమంతా ఆధారపడి ఉందని గుర్తించింది. రూ. 1.25 కోట్ల పరిహారం ఇవ్వాలని బీమా సంస్థను 2016లో ఆదేశించింది.

అయితే, ఇన్సూరెన్స్ ట్రైబ్యునల్​ ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ. ట్రైబ్యునల్​ ఆదేశించిన మొత్తం అధికంగా ఉందని.. టైర్ పేలడం అనేది యాక్ట్​ ఆఫ్​ గాడ్​ అని.. డ్రైవర్​ తప్పిదం కాదని వాదించింది. ఇన్సూరెన్స్ కంపెనీ పిటిషన్​పై విచారించిన బొంబాయి హైకోర్టు.. సంస్థ అభిప్రాయంతో విభేదించింది. డిక్షనరీ ప్రకారం యాక్ట్​ ఆఫ్ గాడ్​ అంటే మానవులు అదుపు చేయలేని సహజ శక్తి అని పేర్కొంది. దీని అర్థం యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది మానవులు అదుపు చేయలేని చర్య అని.. కానీ టైర్ పేలడం అనేది యాక్ట్ ఆఫ్​ గాడ్​ కాదని.. ఇది పూర్తిగా మానవ నిర్లక్ష్యమేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

హై స్పీడ్​, సెకండ్ హ్యాండ్​ టైర్లు, తక్కువ గాలి, ఎక్కువ గాలి ఉన్న టైర్లను వాడం కూడా కారణాలేనని వివరించింది. డ్రైవర్​ లేదా యజమాని వాహనంలో ప్రయాణించే ముందు టైరు ఎలా ఉందో చెక్​ చేసుకోవాలని.. టైరు పేలడం అనేది యాక్ట్ ఆఫ్​ గాడ్ కాదని.. పూర్తిగా మానవ తప్పిదమేనని పునరుద్ఘాటించింది. కేవలం టైరు పేలడం అనేది యాక్ట్ ఆఫ్​ గాడ్​గా చూపించి పరిహారం చెల్లించకుండా ఉండడం సరైంది కాదని ఇన్సూరెన్స్​ కంపెనీకి హైకోర్టు స్పష్టం చేసింది.

ఇవీ చదవండి :స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు ఇవ్వలేం: కేంద్రం

ప్రియుడి కోసం దుబాయ్​ నుంచి వచ్చిన ఎయిర్​హోస్టెస్​.. నాలుగో అంతస్తు నుంచి దూకి..

ABOUT THE AUTHOR

...view details