Justice Pushpa Ganediwala: లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చి.. సంచలనంగా మారిన బాంబే హైకోర్టు మహిళా న్యాయముర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా రాజీనామా చేశారు. తన పదవీ కాలం ముగిసే ఒక్క రోజు ముందే ఆమె రాజీనామా చేయటం గమనార్హం. అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీకాలం ఫిబ్రవరి 12తో ముగియనుంది.
ప్రస్తుతం జస్టిస్ గనేడివాలా.. బాంబే హైకోర్టులోని నాగ్‌పుర్ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021, జనవరి, ఫిబ్రవరిలో లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చిన క్రమంలో పూర్తిస్థాయిలో న్యాయమూర్తి హోదా కల్పించాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది. ఆమె అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలాన్ని పొడగించటం, పూర్తిస్థాయి హోదా కల్పించటం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఆమె డిమోట్ అయ్యి.. 2022, ఫిబ్రవరి 12 నుంచి జిల్లా సెషన్స్ జడ్జిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్లు హైకోర్టు వర్గాలు తెలిపాయి. ఆమె రాజీనామాకు ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివాదాస్పద తీర్పులు..