మహారాష్ట్ర ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్ రాణె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌లను ఠాక్రే కూడా పరుషపదజాలంతో దూషించినట్లు రాణె ఆరోపించారు. ఠాక్రే సర్కారు తనపై ఎన్ని కేలు పెట్టిన భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని రాణె వ్యాఖ్యనించగా.. ఆయన్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి ఆయనకు బెయిల్ లభించింది. అరెస్ట్ అయిన ఒక రోజు అనంతరం మీడియా ముందుకొచ్చారు రాణె.
"నేను ఎవరికీ భయపడను, వెనకడుకు వేయను కూడా. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదిని మర్చిపోయిన ముఖ్యమంత్రిపై నేను ఆగ్రహం వ్యక్తం చేశాను. ఆయన చెప్పిన మాటలనే నేను తిరిగి మీడియాకు చెప్పాను. అది ఎలా నేరం అవుతుంది? ఇకపై మంచి పదాలు ఉపయోగించి విమర్శలు చేస్తాను. మహారాష్ట్రను మరో బంగాల్ కానివ్వను."
- నారాయణ్ రాణె, కేంద్ర మంత్రి
శివసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసే వారి చెంప చెళ్లుమనిపించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించినట్లు రాణె ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తాను తెలిగ్గా తీసుకోనని, రానున్న రోజుల్లో న్యాయపరమైన అంశాలతో.. మహావికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడతానని హెచ్చరించారు రాణె.
'రాణెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు'