తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య కొత్త ఆలయం పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు- యూపీ సీఎంకు కూడా!

Bomb Threat To Ayodhya Ram Mandir : అయోధ్య భవ్యరామ మందిరానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. నూతన ఆలయాన్ని పేల్చివేస్తామంటూ పాక్ ఐఎస్​ఐ ఏజెంట్ ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు.

Bomb Threat To Ayodhya Ram Mandir
Bomb Threat To Ayodhya Ram Mandir

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 8:52 AM IST

Updated : Jan 1, 2024, 9:02 AM IST

Bomb Threat To Ayodhya Ram Mandir :అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన రామమందిరాన్ని పేల్చేవేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మొయిల్‌ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్​ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.

2023 డిసెంబర్​ 27వ తేదీన రైతు సంఘ నాయకుడు దేవేంద్ర తివారీకి పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐతో సంబంధాలు ఉన్న జుబేర్ ఖాన్ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపాడు. అందులో దేవేంద్ర తివారీతోపాటు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, ఎస్​టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్​ను గోసేవకులుగా పేర్కొంటూ బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. అయోధ్య నూతన రామమందిరాన్ని కూడా బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు.

దీంతో దేవేంద్ర తివారీ తనకు వచ్చిన బెదిరింపు మెయిల్ స్క్రీన్ షాట్​ను తన ఎక్స్​ (ట్విట్టర్​) అకౌంట్​లో పోస్ట్ చేశారు. యూపీ పోలీసులతోపాటు సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులను ట్యాగ్ చేశారు. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తును కోరారు. దేవేంద్ర తివారీ ఫిర్యాదు మేరకు లఖ్​నవూలోని సుశాంత్​ గోల్ఫ్ సిటీ పోలీస్​ స్టేషన్ ఇన్​స్పెక్టర్ సహేంద్ర కమార్ కేసు నమోదు చేశారు.

బెదిరింపు మెయిల్​పై దర్యాప్తును మమ్మురం చేశారు పోలీసులు. ఏటీఎస్, ఎస్​టీఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మెయిల్ పంపిన జుబేర్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని దేవేంద్ర తివారీ తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ముంబయిలో 11 బాంబులు పెట్టినట్లు కొన్నిరోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్​కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్​బీఐ కేంద్ర కార్యాలయం సహా ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల కార్యాలయాల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్​లో దుండగులు పేర్కొన్నారు. వరుసగా ఒక్కో బాంబు పేలుతుందని దుండగులు మెయిల్​లో హెచ్చరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ తమ పదవులకు రాజీనామా చేయాలని బెదిరించారు. అయితే సంబంధిత ప్రదేశాల్లో తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.

మోదీ, యోగిని చంపుతామంటూ మెయిల్​.. పోలీసులు అలర్ట్.. త్వరలోనే..

బెంగళూరులో 48 స్కూళ్లకు బాంబు బెదిరింపులు- పేరెంట్స్​లో ఫుల్​ టెన్షన్- పోలీసులు అలర్ట్

Last Updated : Jan 1, 2024, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details