తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయంపై బాంబు దాడి.. కిటికీలు, తలుపులు ధ్వంసం - పయ్యనుర్ న్యూస్

కేరళ కన్నూర్​లోని పయ్యనుర్​ రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్​ఎస్ఎస్​) కార్యాలయంపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి.

rss attack in kerala
rss attack in kerala

By

Published : Jul 12, 2022, 10:55 AM IST

Updated : Jul 12, 2022, 11:24 AM IST

ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయంపై బాంబు దాడి.. సీపీఎం పనేనని ఆరోపణ

కేరళలోని కన్నూర్​ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పయ్యనుర్​లోని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్​ఎస్ఎస్​) కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని.. కానీ గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసుల తెలిపారు. ఈ దాడిలో కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి.

దాడిలో ధ్వంసమైన కుర్చీలు

'సీపీఎం హస్తం'
ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు. అయితే, ఈ దాడి వెనుక అధికార సీపీఎం ఉందని ఆర్​ఎస్ఎస్ ఆరోపించింది. పయ్యనుర్​ సీపీఎం నాయకుడు ధన్​రాజ్​ వర్ధంతి నేపథ్యంలో ఈ దాడి జరిగింది. అతడి మరణం వెనుక ఆర్​ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దాడిలో విరిగిపోయిన తలుపులు

అంతకుముందు జూన్​ 30న కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జూన్​ 30 రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. "ఏకేజీ సెంటర్​లోని మూడో అంతస్తులో నేను పనిచేసుకుంటున్నాను. రాత్రి 11:30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. గేటు వద్ద పొగ అలుముకుంది. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఖండించాలి" అని సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పీకే శ్రీమతి వెల్లడించారు.

Last Updated : Jul 12, 2022, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details