పంజాబ్, హరియాణా ముఖ్యమంత్రుల అధికారిక నివాసాల సమీపంలో బాంబు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. సైన్యానికి చెందిన ఓ బృందాన్నీ పిలిపించారు.
ముఖ్యమంత్రుల ఇళ్ల సమీపంలో బాంబు- రంగంలోకి సైన్యం - చండీగఢ్‌లో బాంబు కలకలం
పంజాబ్, హరియాణా ముఖ్యమంత్రుల అధికారిక నివాసాలకు సమీపంలో బాంబు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
సీఎం ఇంటికి సమీపంలో బాంబు
ఛండీగఢ్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసాలకు 500-700 మీటర్ల దూరంలో ఉన్న నయాగావ్- కన్సల్ రహదారి పక్కన ఉన్న మామిడి తోటలో బాంబు లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. ఇరురాష్ట్రాల సచివాలయాలు కూడా బాంబు దొరికిన ప్రదేశానికి సమీపంలోనే ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని తెలిపారు.
Last Updated : Jan 2, 2023, 6:44 PM IST