ప్రముఖ సెలెబ్రిటీ సన్ని లియోనీ హాజరు కావల్సి ఉన్న ఓ ఫ్యాషన్ షో ప్రాంగణానికి దగ్గరలో బాంబు పేలింది. దీంతో ఆ ఫ్యాషన్ షో అర్ధాంతరంగా ఆగిపోయింది. మణిపుర్ రాజధాని ఇంఫాల్ నగరంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం 6.30 గంటలకు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని ప్రజలు ఒక్కసారిగా భయందోళనలనకు గురయ్యారు.
సన్నీ లియోనీ ఫ్యాషన్ షో సమీపంలో బాంబు పేలుడు.. చైనా గ్రెనేడ్‌తో దాడి! - మణిపూర్‌లోని ఫ్యాషన్ షో దగ్గర బాంబు పేలుడు
మణిపుర్లో భారీ పేలుడు సంభవించింది. సన్ని లియోనీ హాజరు కావల్సి ఉన్న ఓ ఫ్యాషన్ షో ప్రాంగణానికి దగ్గర్లో బాంబు పేలినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హప్తా కాంగ్జేబుంగ్ ప్రాంతంలో జరుగుతున్న ఫ్యాషన్ షో ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎవ్వరికి గాయాలు కాలేదని ఇంఫాల్ ఈస్ట్ ఎస్పీ మహారాబం ప్రదీప్ సింగ్ తెలిపారు. పేలుడుకు చైనీస్ గ్రెనేడ్‌ను వినియోగించినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదని ప్రదీప్ సింగ్ వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.