తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నది ఒడ్డున మైనర్​ మృతదేహం.. స్నేహితులతో కలిసి బాయ్​ఫ్రెండ్ హత్యాచారం! - మైనర్ హత్య

నది ఒడ్డున ఓ బాలిక మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. శవపరీక్షల నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెను తన బాయ్​ ఫ్రెండే.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడి చంపి ఉంటారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Body of minor girl found on river bank in Bengal's Nadia; family alleges rape and murder
Body of minor girl found on river bank in Bengal's Nadia; family alleges rape and murder

By

Published : Mar 9, 2023, 10:40 PM IST

బంగాల్​లో విషాద ఘటన జరిగింది. కృష్ణానగర్​లోని జలంగి నది ఒడ్డున ఓ బాలిక మృతదేహం అనుమానస్పద రీతిలో కనిపించింది. అయితే ఆమెపై ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం కృష్ణానగర్​లోని షష్టితల ప్రాంతంలో జలంగ నది ఒడ్డున ఓ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే 17 ఏళ్ల బాధితురాలు.. కృష్ణానగర్​లో నివాసం ఉంటోందని పోలీసులు తెలిపారు. గత సోమవారం నుంచి ఆమె కనిపించడం లేదని బాలిక కుటుంబసభ్యులు చెప్పారు. ఎన్నిసార్లు ఫోన్​ చేసినా స్పందించడలేదని తెలిపారు. ఆమె కనిపించకుండా పోయిన 24 గంటల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కృష్ణానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలిక మృతదేహాన్ని చూసిన తర్వాత తల్లిదండ్రులు ఆమెను తమ కుమార్తెగా గుర్తించారు.

మృతురాలు స్థానికంగా ఉన్న ఓ యువకుడితో రెండేళ్లుగా లవ్​లో ఉందని బాలిక తల్లి చెప్పింది. గతకొద్ది రోజులుగా తమ కుమార్తె నుంచి ఆ యువకుడు తప్పించుకుంటున్నాడని, ఫోన్ చేసినా సరిగా మాట్లాడలేదని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఇటీవలే ఆ యువకుడు మరో యువతిని ప్రేమిస్తున్నాడని ఆమె తెలిపింది. అయితే మానసిక క్షోభ కారణంగా తమ కుమార్తె చదువుపై ఆసక్తి కోల్పోయిందని చెప్పింది. దీంతో మార్చి 6న తాను ఆమెను తిట్టడం వల్ల మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిందని పేర్కొంది. ఆ యువకుడే తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరేళ్ల మైనర్​పై యువకుడు రేప్​..
ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల మైనర్​పై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితురాలు ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి మేనమామ ఫిర్యాదు మేరకు నిందితుడిపై మాణిక్​పుర్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details