Army on chopper crash: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం అనంతరం.. మృతులను గుర్తించడం సైన్యానికి పెను సవాల్ విసురుతోంది. ప్రమాద తీవ్రత కారణంగా.. అందులో ప్రయాణించిన వారి మృతదేహాలను కనుగొనలేకపోతున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వారి గుర్తింపు కోసం సాధ్యమయ్యే అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి.
ఇందుకోసం బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులను దిల్లీకి రప్పించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల గుర్తింపులో వారికి అవసరమైన సహాయం, మద్దతు ఇస్తామని తెలిపారు. డీఎన్ఏ టెస్టింగ్‌తో అదనంగా.. కుటుంబ సభ్యులు గుర్తించిన వివరాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించారు.
Bodies Identification: గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే.. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సైనిక లాంఛనాలతో అప్పగించనున్నట్లు వెల్లడించారు.
హెలికాప్టర్ క్రాష్‌లో మరణించిన వారి భౌతికకాయాలను.. వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆస్పత్రి నుంచి మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌కు తరలించారు.
General Bipin Rawat Chopper Crash