తెలంగాణ

telangana

ETV Bharat / bharat

150 మందితో వెళ్తూ నదిలో చిక్కుకుపోయిన బోటు.. వంద మందికి పైగా..

సుమారు 150 మందితో వెళ్తున్న బోటు గంగానదిలో చిక్కుకుపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 100 మందిని కాపాడారు.

boat stuck in ganga river
నదిలో చిక్కుకున్న బోటు

By

Published : Nov 9, 2022, 10:55 PM IST

బిహార్ వైశాలి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. గంగా, గండక్ నదీ సంగమం వద్ద ఓ బోటు నీటిలో చిక్కుకుపోయింది. చిక్కుకున్న బోటులో 150 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్​డీఆర్ఎఫ్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఘటనాస్థలి నుంచి 100 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. అనేక మంది పడవలో చిక్కుకుపోయారని చెప్పారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గంగానదిలో స్నానమాచరించేందుకు పట్నా, జెహానాబాద్ నుంచి భక్తులు వచ్చారు. స్నానాలు పూర్తైన తర్వాత వీరంతా తిరిగి వెళ్తున్నారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నది రెండుగా విడిపోయిన చోట బోటు చిక్కుకుపోయింది. దీనిపై వెంటనే సమాచారం అందుకున్న అధికారులు.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చీకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఎస్​డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని చెప్పారు. పడవలో నుంచి అనేక మందిని బయటకు తీయగానే.. చిక్కుకున్న బోటు కదిలిందని ఎస్​డీఆర్ఎఫ్ ఇన్​స్పెక్టర్ దురేంద్ర సింగ్ వెల్లడించారు. వెంటనే బోటు నడిపే వ్యక్తి.. పడవతో సహా పారిపోయాడని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details