Boat capsizes: ఝార్ఖండ్‌లో జామ్తాడా జిల్లాలో పడవ బోల్తా పడి 14 మంది గల్లంతయ్యారు. బరాకర్ నదిలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో పడవలో 20 నుంచి 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పడవలో ఉన్నవారంతా కూరగాయ విక్రయించే చిరు వ్యాపారలేనని పేర్కొన్నారు.
పడవ బోల్తా.. 14 మంది గల్లంతు - ఝార్ఖండ్‌లో పడవ బోల్తా వార్త
Boat capsizes: పడవ బోల్తా పడి 14 మంది గల్లంతైన ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైనవారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Boat capsizes in Jharkhand
జామ్తాడా నుంచి నిర్సాకు వెళ్తుండగా గురువారం సాయంత్రం నది మధ్యలో పడవ బోల్తా పడినట్లు. అధికారులు తెలిపారు. తుపాను కారణంగా బార్బెండియా వంతెన వద్ద పడవ ప్రమాదం జరిగిందని చెప్పారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నిర్వహణ దళాలు(ఎన్డీఆర్ఎఫ్) ఘటనాస్థలికి చేరుకుని నలుగురిని కాపాడగలిగాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మత్స్యకారులు, స్థానికులు ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పెళ్లి కాలేదని వెళితే.. తల్లీకూతుళ్లపై రెండేళ్లుగా బాబా అత్యాచారం!
Last Updated : Feb 25, 2022, 11:23 AM IST