తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంగా నదికి పూజ చేసేందుకు వెళ్తుండగా బోటు బోల్తా.. నలుగురు మహిళలు మృతి - కర్ణాటకలో చెట్టు కూలి బైకర్ మృతి

గంగా నదికి పూజ చేసేందుకు వెళ్తుండగా పడవ బోల్తాపడి నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు భారీ వర్షాలకు చెట్టు కూలిపోయి వృద్ధుడిపై పడడం వల్ల అతడు మృతి చెందాడు.

boat-capsized-in-uttar-pradesh-several-women-killed-up-boat-accident
boat-capsized-in-uttar-pradesh-several-women-killed-up-boat-accident

By

Published : May 22, 2023, 3:09 PM IST

ఉత్తరప్రదేశ్​లో జరిగిన బోటు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం ఉదయం ప్రయాణికులతో వెళుతున్న పడవ నదిలో బోల్తా పడింది. దీంతో గంగా నదికి పూజ చేసేందుకు వెళ్లిన నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. చిన్న బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్దేపుర్ ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన అక్కడ ఉన్న మత్స్యకారులు.. బాధితులను కాపాడేందుకు వెంటనే నదిలోకి దూకారు. కొంత మందిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరికొందరి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. 20 మందికి పైగా ఆచూకీ లభించడం లేదని అధికారులు తెలిపారు. బాధితుల్లో కొందరు ఆపస్మారక స్థితిలోకి వెళ్లారని.. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించామని వారు వెల్లడించారు.

గంగా నదికి పూజ చేసేందుకు వెళ్తుండగా బోటు బోల్తా

నదిలో కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థులు..
నదిలో మునిగిపోతున్న ఓ విద్యార్థిని కాపాడేందుకు వెళ్లి.. మరో విద్యార్థి ప్రాణాలు విడిచాడు. బాధితులకు ఈత రాని కారణంగానే ఇద్దరూ చనిపోయినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని చిక్కమగళూరులో ఈ విషాద ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కొందరు కాలేజీ విద్యార్థులు శృంగేరి సమీపంలోని తుంగ నది వద్దకు వెళ్లారు. అందులో రక్షిత్​(20) అనే విద్యార్థి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. అనంతరం నదిలో చిక్కుకుపోయాడు. దాన్ని గమనించిన ప్రజ్వల్​ అనే విద్యార్థి.. స్నేహితుడ్ని కాపాడేందుకు నదిలోకి దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల.. నదిలో కొట్టుకుపోయారు.

ఘటనపై మిగతా స్నేహితులు.. స్థానికులకు సమాచారం ఇచ్చినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే బాధితులు చాలా దూరం కొట్టుకుపోయారు. మృతులిద్దరూ శృంగేరికి చెందినవారని పోలీసులు తెలిపారు. వారు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నట్లు వారు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

చెట్టు కూలి ద్విచక్రవాహనదారుడు మృతి..
భారీ వర్షాల కారణంగా స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిపై చెట్టు కూలిపడింది. దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వృద్దుడు మృతి చెందాడు. కర్ణాటకలోని చిక్కమగళూరులోనే ఈ ఘటన కూడా జరిగింది. మృతుడిని 65 ఏళ్ల వేణుగోపాల్​గా పోలీసులు గుర్తించారు. మృతుడి​ స్వస్థలం హస్సన్ అయినప్పటికీ..​ ముదిగెరె ప్రాంతంలో స్థిరపడ్డాడు. వేణుగోపాల్ గతంలో ఓ ప్యాన్సీ స్టోర్​ను నడిపించేవాడు. కాగా ఆదివారం స్కూటీపై బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగివస్తుండగా ఓ భారీ వృక్షం వేణుగోపాల్​పై పడడం వల్ల తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు

చెట్టు కూలి ద్విచక్రవాహనదారుడు మృతి

ABOUT THE AUTHOR

...view details