తెలంగాణ

telangana

ETV Bharat / bharat

55 మందితో వెళ్తున్న పడవ నదిలో బోల్తా... 10 మంది గల్లంతు - గంగా నదిలో పడవ బోల్తా

గంగా నదిలో పడవ బోల్తా పడింది. పశువుల మేతను తీసుకుని తిరిగి వస్తున్న 55 మంది అకస్మాత్తుగా గంగా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారందరూ సురక్షితంగా బయటపడినప్పటికి మరికొందరు గల్లంతయ్యారు.

Etv BharatBoat Capsized In River Ganga Patna
Boat Capsized In River Ganga Patna

By

Published : Sep 5, 2022, 10:39 AM IST

Updated : Sep 5, 2022, 7:15 PM IST

Boat Capsized In River Ganga : బిహార్​లోని గంగానదీలో దుర్ఘటన చోటు చేసుకుంది. సుమారు 55 మంది ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా బోల్తపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పట్నా సమీపంలోని దానాపూర్ పట్టణం షాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 10 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. రాత్రంతా నదిని జల్లెడ పట్టారు. ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదని వారు తెలిపారు.

గాలింపు చర్యలు

అసలేం జరిగింది: రోజులాగే ఆదివారం సుమారు 55 మంది పశువుల మేత తెచ్చేందుకు మరికొందరు కూరగాయలు కోసేందుకు గంగాహర ద్వీపానికి బయలు దేరారు. తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడం వల్ల ప్రయాణికులు నదిలోకి దూకేశారు. అందులో ఈత వచ్చిన వారు ఒ‌డ్డుకు చేరాగా మిగిలిన వారు గల్లంతైనట్లు పేర్కొన్నారు. చిన్నబోటులో పరిమితికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

ప్రమాద స్థలంలో స్థానికులు
గాలింపు చర్యలు
Last Updated : Sep 5, 2022, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details