తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోర్డు పరీక్షలు వాయిదా- ఫిబ్రవరి తర్వాతే

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేసింది విద్యాశాఖ. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ వెల్లడించారు.

Board exams
బోర్డు పరీక్షలు వాయిదా- 2021 ఫిబ్రవరి తర్వాతే

By

Published : Dec 22, 2020, 5:46 PM IST

Updated : Dec 22, 2020, 6:25 PM IST

బోర్డు పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ కీలక ప్రకటన చేశారు. 2021 జనవరి, ఫిబ్రవరిలో బోర్డు పరీక్షలు జరగవని తెలిపారు.

పరీక్షలపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉపాధ్యాయులతో జరిగిన ఆన్​లైన్​ సమావేశంలో వెల్లడించారు. కరోనా తీవ్రత పెరగడం వల్లే పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

"ప్రస్తుత పరిస్థితుల కారణంగా 10,12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 ఫిబ్రవరిలో నిర్వహించడం లేదు. పరిస్ఖితులను అంచనా వేసి, మరికొంత మందిని సంప్రదించి తదుపరి షెడ్యూల్​పై నిర్ణయం తీసుకుంటాం."

- రమేశ్​ పోఖ్రియాల్​, కేంద్ర విద్యాశాఖ మంత్రి

అయితే 2021లో జరగాల్సిన బోర్డు పరీక్షలను ఆన్​లైన్​లో కాకుండా రాతపద్ధతిలోనే నిర్వహిస్తామని ఈనెల మొదట్లో సీబీఎస్​ఈ తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూసివేశారు. అక్టోబర్​ 15 నుంచి కొన్ని పాఠశాలలు పాక్షిక్షంగా తెరిచారు.

Last Updated : Dec 22, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details