తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు - cbse exams postponed

Board Exams for Class 10th cancelled
సీబీఎస్​‌ఈ

By

Published : Apr 14, 2021, 2:03 PM IST

Updated : Apr 14, 2021, 2:30 PM IST

14:01 April 14

సీబీఎస్​‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్​‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రితో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారని పేర్కొంది.   

విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా 10వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. మార్కులపై అభ్యంతరాలు ఉంటే పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. పరిస్థితి సద్దుమణిగాక అనువైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని.. పరీక్షలకు 15 రోజుల ముందు నోటీసులు ఇస్తామని తెలిపింది. జూన్ 1న పరిస్థితిని సమీక్షించి తదుపరి పరీక్షల తేదీ ప్రకటిస్తామని వెల్లడించింది.  

ఇదీ చదవండి :యూపీ సీఎం యోగి, ఎస్పీ అధినేత అఖిలేశ్​కు కరోనా

Last Updated : Apr 14, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details