manipur bomb blast: మణిపుర్లో భాజపా బహిష్కృత నేత చోంగ్తామ్ బిజోయ్ నివాసం దగ్గర్లో బాంబు పేలుడు జరిగింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంపెల్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు.
ఎన్నికల వేళ.. భాజపా బహిష్కృత నేత ఇంటి వద్ద పేలుడు - manipur assembly elections 2022
Manipur Bomb Blast: మణిపుర్లో బాంబు పేలుడు కలకలం రేపింది. భాజపా బహిష్కృత నేత చోంగ్తామ్ బిజోయ్ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
మణిపుర్లో బాంబుపేలుడు
బిజోయ్ను గతనెలలోనే భాజపా పార్టీ.. క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. రాజకీయంగా అణగదొక్కేందుకే తనపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని జిజోయ్ అన్నారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలోని 22 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ బాంబు పేలుడుతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: లోయలోకి దూసుకెళ్లిన ఎస్యూవీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం