తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టులో భారీ పేలుడు.. ఒకరు మృతి.. వారి పనేనన్న సీఎం! - బాంబు పేలుడు

Blast in Ludhiana Court Complex
లుథియానా కోర్టు కాంప్లెక్స్​లో పేలుడు

By

Published : Dec 23, 2021, 12:49 PM IST

Updated : Dec 23, 2021, 5:28 PM IST

12:44 December 23

లుథియానా కోర్టు కాంప్లెక్స్​లో పేలుడు

కోర్టులో భారీ పేలుడు

పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో పేలుడు సంభవించింది. రెండో అంతస్తులో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఉదయం 11 గంటలకు రెండో అంతస్తులోని కోర్టు నంబరు 14 సమీపంలో శౌచాలయం వద్ద పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు తీవ్రతకు శిథిలాలు.. ఎగురుకుంటూ వచ్చి కింద ఉన్న వాహనాలపై పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు కోర్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. పేలుడు కారణాలేమిటని ఆరా తీశారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో గాలించారు. కోర్టు వద్ద భద్రతను పెంచారు.

పేలుడు జరిగిన ప్రాంతాన్ని మూసివేశామని, ఫోరెన్సిక్​ బృందాలు నమూనాలు సేకరిస్తున్నట్లు చెప్పారు లుథియానా పోలీస్​ కమిషనర్​ గుర్​ప్రీత్​ సింగ్​ భుల్లార్​. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

విద్రోహ శక్తుల పనే..

పేలుడులో గాయపడిన బాధితులను లుథియానాలోని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

"అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అలాంటి ఘటనలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదు."

- చరణ్​జీత్​ సింగ్​ చన్నీ, పంజాబ్​ ముఖ్యమంత్రి.

మాజీ సీఎం దిగ్భ్రాంతి..

కోర్టు ఆవరణలో పేలుడు సంభవించి పలువురు మరించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ట్వీట్​ చేశారు.

మరోవైపు.. పంజాబ్​లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కొందరు చూస్తున్నారని, రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజలు వారని సఫలం కానివ్వరని పేర్కొన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

Last Updated : Dec 23, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details