ఇటుకల బట్టీలో భారీ పేలుడు.. 9 మంది మృతి - బిహార్ క్రైమ్ న్యూస్
ఇటుకల బట్టీలో భారీ పేలుడు జరిగి 9 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. బిహార్లోని మోతిహరిలో జరిగిందీ ఘటన.
బిహార్ మోతిహరిలో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. రామ్గఢ్వా ఠాణా పరిధిలోని నగీర్పుర్లో ఇటుకల బట్టీలోని చిమ్నీ ఒక్కసారిగా పేలిపోయింది. ఫలితంగా శిథిలాలు అక్కడున్న కూలీలపై పడ్డాయి. ఈ ఘటనలో ఇటుక బట్టీ యజమాని సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది చిమ్నీ శకలాల కింద కూరుకుపోయినట్లు తెలిసింది. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను రక్సాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.