ప్లాస్టిక్ కర్మాగారంలో పేలుడు- ఐదుగురు మృతి - బంగాల్ క్రైమ్ వార్తలు
13:25 November 19
ప్లాస్టిక్ కర్మాగారంలో పేలుడు- ఐదుగురు మృతి
బంగాల్ మాల్డాలోని సుర్జాపుర్ బస్స్టాండ్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మాల్డా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఘటన జరిగిన తర్వాత పెద్ద సంఖ్యలో జనం చేరుకోవటం వల్ల పరిస్థితి అదుపు చేసేందుకు భారీగా బలగాలను పంపించినట్లు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.