ఎంతటి రోగాన్నైనా నయం చేయగల స్థాయికి వైద్య రంగం అభివృద్ధి చెందినప్పటికీ.. నేటికీ కొందరు మూఢనమ్మకాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. ప్రార్థనలు, మంత్రాలతో(black magic in kerala) నయమవుతుందని నమ్మి ఆ బాలిక మృతికి కారణమయ్యాడో తండ్రి. ఈ సంఘటన కేరళలోని కన్నూర్‌లో జరిగింది.
ఏమైందంటే?
కన్నూర్‌కు చెందిన ఎంఏ సత్తార్ అనే వ్యక్తి కుమార్తె ఫాతిమా(11) కొద్ది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురైంది. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మత గురువు ఉవాయిస్ దగ్గరికి తీసుకెళ్లాడు. మతపరమైన ప్రార్థనలు, క్షుద్రపూజలతో(black magic in kerala) నయం చేయాలని కోరాడు. అయితే.. సరైన సమయంలో చికిత్స అందక ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.