మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. కొవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నప్పటికీ.. ఫంగస్ కారణంగా 52 మందికి పైగా మరణించినట్లు సీనియర్ వైద్యాధికారి తెలిపారు. ఈ శిలీంద్ర వ్యాధి కారణంగా చాలా మంది కంటి చూపును కోల్పోతున్నట్లు వెల్లడించారు.
"మ్యూకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వల్ల మహారాష్ట్రలో 52 మంది మృతిచెందారు. వీరందరూ కొవిడ్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నవారే. బ్లాక్ ఫంగర్ వల్ల చనిపోయినవారి సంఖ్యను ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది."
--సీనియర్ వైద్యాధికారి.
మహారాష్ట్రలో 1500కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.