నూతన సాగు చట్టాల రద్దు బిల్లు-2021కు(Farm Laws Repeal Bill in loksabha) లోక్సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్(rakesh tikait bhartiya kisan union) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సాగిన తమ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు ఇది నివాళి అని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర సహా వివిధ అశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని స్పష్టం చేశారు.
"దేశంలో ఎలాంటి నిరసనలు జరగకుండా చూడాలని ప్రభుత్వం యత్నిస్తోంది. అన్నారు. కానీ, పంటలకు కనీస మద్దతు ధర సహా వివిధ అశాలపై చర్చ జరిగేవరకు మేం ఉద్యమ వేదికను వీడబోం"
-రాకేశ్ టికాయిత్, బీకేయీ నేత.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల(Parliament winter sessions) తొలిరోజే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్సభలో సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది.
కేంద్రం గతేడాది తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi).. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని (farm laws repealed) సంచలన ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగణంగా నేడు 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'ని కేంద్రం ప్రవేశపెట్టగా లోక్సభ ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి:ఎన్నికల వేళ శీతాకాల సమావేశాలు.. పైచేయి ఎవరిదో?