తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభలో అధికారపక్ష నేతగా గోయల్!

కేంద్రమంత్రి పీయూష్ గోయల్​కు భాజపా అధిష్ఠానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. రాజ్యసభలో భాజపాపక్ష నేతగా ఆయన్ను నియమించింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

piyush goyal
రాజ్యసభలో అధికారపక్ష నేతగా గోయల్

By

Published : Jul 14, 2021, 4:05 PM IST

Updated : Jul 14, 2021, 4:43 PM IST

రాజ్యసభలో అధికార పక్షనేతగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు జులై 19నుంచి జరిగే వర్షాకాల సమావేశాల నుంచి రాజ్యసభలో భాజపా నాయకుడిగా ఆయన వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ.. రాజ్యసభ సెక్రెటేరియట్​కు తెలియజేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అంతకుముందు వరకు ఆ స్థానంలో ఉన్న థావర్‌చంద్‌ గహ్లోట్‌ ఇటీవల కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ఫలితంగా రాజ్యసభ పక్షనేత బాధ్యతను భాజపా అధిష్ఠానం పీయూష్ గోయల్‌కు అప్పగించింది.

మంత్రివర్గ పునర్​వ్యవస్థీకరణలో భాగంగా ఇటీవలే గోయల్​కు.. వినియోగదారుల వ్యవహారాలు; ఆహార పంపిణీ; జౌళి శాఖలను కేటాయించారు ప్రధాని మోదీ. ఆయన ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ బాధ్యతలను చూసుకుంటున్నారు. రాజ్యసభకు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న గోయల్.. ప్రస్తుతం ఎన్​డీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు భాజపా కోశాధికారిగా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చురుగ్గా పనిచేశారు.

ఇదీ చదవండి:వరకట్నానికి వ్యతిరేకంగా గవర్నర్​ నిరాహార దీక్ష

Last Updated : Jul 14, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details