తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Modi birthday: ప్రధాని బర్త్​డే.. వ్యాక్సినేషన్​లో ఆ రికార్డు కోసం..! - మోదీ బర్త్​డే

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (Modi birthday) సందర్భంగా 1.5 కోట్లకు పైగా వ్యాక్సిన్​ డోసులను (Vaccination in India) పంపిణీ చేయాలని భాజపా కృషి చేస్తోంది. మరోవైపు జైపుర్​ ఫూట్​ యూఎస్​ఏ సంస్థ గుజరాత్​లో మొబైల్​ వ్యాన్​లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

pm modi birthday
ప్రధాని జన్మదినం సందర్భంగా 1.5 కోట్ల టీకా డోసులు!

By

Published : Sep 16, 2021, 3:43 PM IST

Updated : Sep 16, 2021, 3:48 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా (Modi birthday) దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా టీకాలను పంపిణీ (Vaccination in India) చేయాలని భాజపా కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని జన్మదిన వేడుకలు (Modi birthday) ప్రత్యేకంగా నిర్వహించాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భావిస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్​ వెల్లడించారు.

"ప్రజలను కాపాడటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీ పుట్టిన రోజున.. వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడం కంటే ప్రత్యేకమైనది ఏముంటుంది. మన దేశం తరపున రెండు రకాల కొవిడ్​ వ్యాక్సిన్లు ఉండటం గర్వకారణం. వీటి వల్లే ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోగలుతున్నాం. కొవిడ్​ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీకి ఇది మంచి బహుమతి."

-తరుణ్​ చుగ్​, భాజపా ప్రధాన కార్యదర్శి

రాజకీయ కారణాలతో వ్యాక్సిన్లపై ప్రజలలో అనుమానాలు కలిగిస్తున్న వారికి ఈ టీకా పంపిణీ ద్వారా దీటైన జవాబు చెప్పినట్లు అవుతుందని భాజపా సీనియర్​ నేతలు పేర్కొన్నారు.

మొబైల్​ వ్యాన్​లు ప్రారంభం..

ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు (Modi birthday) సందర్భంగా జైపుర్​ ఫూట్​ యూఎస్​ఏ సంస్థ (jaipur foot USA) గుజరాత్​లో మొబైల్​ వ్యాన్​లు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా దివ్యాంగులకు ఉచితంగా ప్రోస్థటిక్​ ఫిట్​మెంట్స్​ను పంపిణీ చేయనుంది. బుధవారం నిర్వహించిన వర్చువల్​ కార్యక్రమంలో వీటిని ప్రారంభించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఎనిమిది మంది సిబ్బందితో తొలి మొబైల్​ వ్యాన్​ను ప్రధాని సొంతూరైన వాద్​నగర్​కు తరలించారు.

ఇదీ చూడండి :'అలా అయితేనే పెళ్లిచేసుకుంటాను'.. పీఎం, సీఎంకు లేఖ!

Last Updated : Sep 16, 2021, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details