ఉత్తరాఖండ్ భాజపాలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నియామకమైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్, ఉత్తరాఖండ్ వ్యవహారాల బాధ్యుడు రమణ్ సింగ్‌లు తమ నివేదికను అధిష్ఠానానికి సమర్పించారు. రాష్ట్ర భాజపాలో వరుస ఘటనల నేపథ్యంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వెల్లువెత్తాయి.
గతవారం అత్యవసరంగా నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో దుష్యంత్ గౌతమ్‌తో పాటు.. రమణ్ సింగ్, త్రివేంద్ర సింగ్ రావత్, అజయ్ భట్, నరేష్ భన్సల్, మాలా రాజ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తరాఖండ్‌లో పరిస్థితులపై చర్చించారు. ఈ క్రమంలో అధిష్ఠానానికి నివేదికను అందజేశారు.