తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు భాజపా అభ్యర్థుల తొలి జాబితా! - modi news latest

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవ్వచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

BJP's CEC to meet on Thursday to finalise first list of candidates for assembly polls
నేడు భాజపా అభ్యర్థుల తొలి జాబితా!

By

Published : Mar 4, 2021, 5:12 AM IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 27న అసోం, బంగాల్‌లో తొలి విడత పొలింగ్ జరగనున్న స్థానాలకు అభ్యర్థులను నేడు ఖరారు చేసే అవకాశముంది.

అసోం సీఎం సరబానంద సోనోవాల్‌తో పాటు బంగాల్‌కు చెందిన ముఖ్య నేతలు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే అభ్యర్థుల మొదటి జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భాజపా వర్గాలు పేర్కొన్నాయి.

ఒక్కో స్థానానికి ఐదుగురు..

బంగాల్​లో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరిగే 60 అసెంబ్లీ స్థానాలకు ఒక్కో దానికి ఐదుగురు ఐదుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘేశ్​ తెలిపారు. తుది అభ్యర్థిని పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు.

ఇదీ చూడండి:బంగాల్​ దంగల్​: భాజపాలో గంగూలీ చేరిక ఖాయమా?

ABOUT THE AUTHOR

...view details