బంగాల్, అసోంలో మొదటి రెండు దశల అసెంబ్లీ ఎన్నికల సీట్లపై సీఈసీ సమావేశంలో చర్చ జరిగిందని బంగాల్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
'తుది నిర్ణయం తీసుకున్నాక అభ్యర్థుల ప్రకటన' - BJP National president JP Nadda arrives BJP Headquarters for Central Election Committee (CEC) meet

01:06 March 05
01:02 March 05
బంగాల్ నందిగ్రామ్ నియోజక వర్గంలో భాజపా తరఫున సువేందు అధికారి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేత ముకుల్ రాయ్ తెలిపారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భాజపా సీఈసీ భేటీ అనంతరం ఈ మేరకు వెల్లడించారు.
20:31 March 04
భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన భాజపా ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న ఎన్నికలపై నేతలు చర్చిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అంశం సైతం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నరేంద్ర సింగ్ తోమర్, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
19:56 March 04
భాజపా కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు స్వాగతం పలికారు.
ఐదు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ 'కేంద్ర ఎన్నికల కమిటీ' సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. పలువురు నేతలు ఇప్పటికే భాజపా ఆఫీస్కు చేరుకున్నారు.
19:10 March 04
పార్టీ కార్యాలయానికి చేరుకున్న షా, గడ్కరీ
కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ సైతం భాజపా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో వారు పాల్గొననున్నారు.
18:21 March 04
'తుది నిర్ణయం తీసుకున్నాక అభ్యర్థుల ప్రకటన'
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. త్వరలో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ 'కేంద్ర ఎన్నికల కమిటీ'(సీఈసీ) సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
TAGGED:
live