Rahul Gandhi On BJP Bulldozers: కేంద్రంలోని భాజపా సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై బుల్డోజర్లు నడపాలన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామనవమి సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా బుల్డోజర్లలో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయంటూ మంగళవారం ట్వీట్ చేశారు.
'భాజపా బుల్డోజర్లు విద్వేషపూరితమైనవి' - rahul tweet
Rahul Gandhi On BJP Bulldozers: దేశంలో రోజురోజుకూ అధికమవుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపై బుల్డోజర్లు నడపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భాజపా బుల్డోజర్లు విద్వేశపూరితమైనవని ఆయన ఆరోపించారు. కాగా, రామనవమి రోజున ద్వేషపూరిత చర్యలకు పాల్పడ్డారంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు.
Sri RamaNavami Stone Pelting: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో హింసాకాండ చెలరేగింది. కొందరు దుండగులు రాళ్ల దాడి చేయడం వల్ల ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సుమారు 80మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆది, సోమవారాల్లో ఖర్గోన్ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. జరిగిన ఆస్తి నష్టాన్ని దుండగుల నుంచే వసూలు చేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సైతం కేంద్రంపై విరుచుకుపడ్డారు. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడని పిలుస్తారని, అది స్వచ్ఛతకు చిహ్నమన్నారు. రామనవమి రోజున అసహనం, హింస, ద్వేషపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇదీ చదవండి:రెండు కాలేజీల విద్యార్థుల వీరంగం.. రాళ్లు రువ్వుకుంటూ..!