బంగాల్లో రాజకీయ హింస కొనసాగుతోంది. భాజపా నేత సువేందు అధికారి ర్యాలీలో పాల్గొనడానికి వెళుతోన్న ఆ పార్టీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు. ఇది తృణమూల్ పార్టీ వాళ్ల పనేనని భాజపా ఆరోపించింది.
రణరంగం...
బంగాల్లో రాజకీయ హింస కొనసాగుతోంది. భాజపా నేత సువేందు అధికారి ర్యాలీలో పాల్గొనడానికి వెళుతోన్న ఆ పార్టీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు. ఇది తృణమూల్ పార్టీ వాళ్ల పనేనని భాజపా ఆరోపించింది.
రణరంగం...
ఖెజురీలో సువేందు ర్యాలీకి వెళ్తుండగా... తూర్పు మెదినీపుర్లోని బారటాలా ప్రాంత సమీపంలో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కార్లు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన భాజపా కార్యకర్తలపై బాంబులు విసిరారు. ఈ దాడి తర్వాత భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయగా.. పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు.
ఇదీ చూడండి:జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి