ఉత్తర్ప్రదేశ్ అమేఠీలోని జైసలో.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసేందుకు వెళ్లిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. భాజపా కార్యకర్తలు, జైస మున్సిపల్ అధ్యక్షుడు, ఆయన తనయుడు.. ఆ మహిళలపై దాడి చేశారు.
అమేఠీలోని జైస్లో శుక్రవారం పర్యటించిన ఇరానీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే ఆమె పర్యటనకు కొద్ది గంటల ముందు కొందరు మహిళలు అక్కడికి వెళ్లారు. ఇరానీతో మాట్లాడి.. వారి కష్టాలను చెప్పుకోవాలని ఎదురుచూశారు. ఇంతలో జైస మున్సిపల్ అధ్యక్షుడు మహేశ్ శొంకర్, ఆయన తనయుడు భాను శొంకర్లు ఘటనాస్థలానికి వెళ్లి వారిని కొట్టినట్టు తెలుస్తోంది.