ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బంగాల్ శాసన సభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించింది భాజపా. ఈ మేరకు భాజపా కార్యదర్శి, ఆ పార్టీ బంగాల్ బాధ్యులు కైలాస్ విజయ వర్గీయ తెలిపారు.
భాజపా అధికారంలోలేని చాలా రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికలల్లో తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండానే బరిలో నిలిచాం. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, అసోంలో అలాగే చేశాం. బంగాల్లో కూడా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే ఎన్నికల బరిలో నిలుస్తాం. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆధిక్యం లభించాకే పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యేలు కలిసి సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తాయి.
-కైలాస్ విజయ వర్గీయ, బంగాల్ భాజపా బాధ్యులు
బంగాల్‌కు కాబోయే తమ పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తారని అన్నారు వర్గీయ.
మమతా బెనర్జీ నాయత్వంపై అసంతృప్తితో ఉన్న వారందరు భాజపాలోకి వస్తున్నారు. తమ పార్టీపై నమ్మకంతో, నరేంద్రమోదీపై విశ్వాసంతో ఉన్న వారినే తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గోవుల అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి భాజపాలో చోటు లేదు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునేది జరగదు.