తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2021, 6:29 PM IST

ETV Bharat / bharat

'భాజపాతో అభివృద్ధి- కాంగ్రెస్​తో చొరబాట్లు'

అసోంలో తాము అధికారంలోకి వస్తే 'లవ్​, ల్యాండ్​ జిహాద్​'ను అరికట్టేందకు చట్టాలను తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీని పర్యటకుడిగా అభివర్ణించారు షా. మోదీ డబుల్ ఇంజిన్ అభివృద్ధి కావాలా? లేక కాంగ్రెస్- ఏఐయూడీఎఫ్ డబుల్​ చొరబాట్లా? ఏది కావాలో అసోం ప్రజలే నిర్ణయించుకోవాలని షా సూచించారు.

amit sha in assm poll campaign
అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్​షా

అసోంలో తాము అధికారంలోకి వస్తే 'లవ్​, ల్యాండ్​ జిహాద్​'ను అరికట్టేందకు చట్టాలను తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా హామీ ఇచ్చారు. అసోంలోని కమల్​పుర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆ పాల్గొన్నారు. సమర్థవంతమైన చట్టాలు, విధానాలతో అసోం సంస్కృతి, నాగరికతను బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

"రాహుల్ గాంధీ పర్యటకుడు. ఆయన కేవలం ఎన్నికల సమయంలో రెండు, మూడు రోజులు వచ్చి వెళ్తుంటారు. ప్రస్తుతం అసోం ప్రజలకు ముగ్గురి ముఖచిత్రాలే కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ అభివృద్ధి, సేవ, రాహుల్​ గాంధీ టూరిజం, అజ్మల్ అక్రమచొరబాట్ల అజెండా.. అసోం ప్రజలకు ఎవరు కావాలో వారే నిర్ణయించుకోవాలి. మోదీ డబుల్ ఇంజిన్ అభివృద్ధా? లేక కాంగ్రెస్- ఏఐయూడీఎఫ్ డబుల్​ చొరబాట్లా?"

-- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

కాంగ్రెస్ మేనిఫెస్టో కేవలం ఎన్నికల ప్రచారానికి సాధన మాత్రమేనని.. భాజపా మేనిఫెస్టో అమలు చేయటానికని స్పష్టం చేశారు షా. అసోంకు గుర్తింపు తెచ్చింది ఏఐయూడీఎఫ్ నేత బద్రూద్దిన్​ అజ్మల్ అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాహుల్ గాంధీకి అసోం సంస్కృతి, గుర్తింపు గురించి తెలియదని విమర్శించారు.

దేశంలోనే నెం.1 రాష్ట్రంగా

అసోంలో భాజపా అధికారంలోకి వస్తే రూ. 2లక్షల కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ హామీ ఇచ్చారు. అసోంను దేశంలోనే నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అసోంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు రూ. 1,300 కోట్లతో వెదురు మిషన్​కు కేంద్రం ఆమోదం తెలిపిందని వివరించారు.

అసోంలో మొత్తం 126 స్థానాలకు మూడు దశల్లో ఓటింగ్​ జరగనుంది. శనివారం జరగనున్న తొలి దశ ఎన్నికల్లో మొత్తం 47 నియోజకవర్గాల్లో తమ ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఓటర్లు.

ఇదీ చదంవండి :బంగాల్​, అసోంలో తొలి దశ ప్రచారం సమాప్తం

ABOUT THE AUTHOR

...view details