తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం కోడలు బొమ్మతో భాజపా ప్రచారం! - Tmailnadu BJP election manifesto

తమిళనాట ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కోడలు శ్రీనిధి కార్తీ చిదంబరం వీడియోను ఉపయోగించింది భాజపా. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా.. తొలగించింది. దీనిపై శ్రీనిధి సహా కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు.

BJP uses karthi chidambaram wife video for their election promotional video and later deleted
భాజపా ప్రచార వీడియోలో చిదంబరం కోడలు ఫొటో

By

Published : Mar 31, 2021, 2:39 PM IST

తమిళనాడు భాజపా ట్విట్టర్​లో ఫోస్ట్​ చేసిన వీడియో వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచార వీడియోలో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్​ కాంగ్రెస్ నేత చిదంబరం కోడలు శ్రీనిధి కార్తీ చిదంబరం భరతనాట్యం చేస్తున్న వీడియోను ఉపయోగించింది కమలదళం. తమరై మలరటుమ్​, తమిళనాడు వలరటుమ్​(కమలం వికసిస్తుంది, తమిళనాడు అభివృద్ధి చెందుతుంది) అంటూ ట్వీట్​​ చేసింది. అయితే తర్వాత ఈ పోస్టును తొలగించింది.

భాజపా ప్రచార వీడియోలో శ్రీనిథి ఫొటో

'కమలం వికసించదు'

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా.. వెంటనే ఆ పోస్టును భాజపా తొలగించింది. దీనిపై స్పందించిన శ్రీనిధి.. "నా ఫొటోను భాజపా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం అసంబద్ధం. తమిళనాడులో 'తమరై ఎండ్రం మలరతు' (కమలం ఎప్పుడూ వికసించదు)" అని ట్వీట్​ చేశారు.

పదేళ్ల క్రితం వీడియో..

శ్రీనిధి వీడియో... 10 ఏళ్ల నాటిది. డీఎంకే నేత, మాజీ సీఎం కరుణానిధి రాసిన 'సెమ్మోజి' పాటకు ఏఆర్​ రెహ్మాన్ సంగీతం అందించగా ఆమె నాట్యం చేశారు. ఇందులోని ఓ చిన్న క్లిప్​ను భాజపా తన మేనిఫెస్టో ప్రచార వీడియోకు జోడించింది.

'అనుమతి గురించి భాజపాకు తెలియదు'

భాజపా ట్వీట్​ను తమిళనాడు కాంగ్రెస్​ తప్పుపట్టింది. "అనుమతి అనేది మీరు(భాజపా) అర్థం చేసుకోవడం కష్టమైన అంశం అని మేము అర్థం చేసుకున్నాం" అంటూ ఎద్దేవా చేసింది. 'శ్రీనిధి కార్తీ చిదంబరం అనుమతి లేకుండా ఆమె ఫొటోను ఉపయోగించకూడదు. దీన్ని బట్టి మీ(భాజపా) ప్రచారం అంతా అబద్ధమని రుజువైంది" అని పేర్కొంది.

ఇదీ చూడండి:భాజపా అభ్యర్థిపై దాడి- వై ప్లస్ భద్రత కల్పించిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details