140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం ఒక్కటంటే ఒక్కటే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరిచింది. వామపక్షాల ఇలాకాలో భాజపా పరిస్థితేంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మార్చేందుకే కాషాయ పార్టీ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులను ఇందుకు ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలోనే 'మెట్రోమ్యాన్'గా పిలిచే శ్రీధరన్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.
ఇదీ చదవండి:కేరళలో ఇప్పుడైనా భాజపా పుంజుకుంటుందా?
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ తలపెట్టిన విజయ యాత్రలో భాగంగా.. ఈ.శ్రీధరన్‌కు పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ ప్రకటించింది. త్రిస్సూర్ లేదా ఎర్నాకులం నుంచి ఆయన్ను బరిలోకి దించాలని భావిస్తోంది. తద్వారా మెట్రోమ్యాన్ ఇమేజ్ను ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని అనుకుంటోంది భాజపా. అభివృద్ధి విషయాల్లో ఆయనకు ఉన్న మంచిపేరు పార్టీకి లాభిస్తుందని విశ్వసిస్తోంది.