బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార జోరును పెంచింది భాజపా. రాష్ట వ్యాప్తంగా 'పరివర్తన్ యాత్ర'లు చేపట్టేందుకు సిద్దమవుతోంది. బంగాల్ ప్రజలకు పార్టీని మరింత దగ్గర చేసేందుకు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోశ్ తెలిపారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సందేశంతో భాజపా కేంద్ర నాయకుల సమక్షంలో రాష్ట్రంలోని ఐదు జోన్లలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు చెప్పారు.
ఇదే తరహాలో రెండున్నర ఏళ్ల క్రితం బంగాల్లో భాజపా 'జన్ సంపర్క్ అభియాన్' కార్యక్రమం నిర్వహించేందుకు మమతా బెనర్డీ సర్కర్ అనుమతులివ్వలేదని ఘోష్ గుర్తు చేశారు. తృణమూల్ అవినీతి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.