ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరుగురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, రాష్ట్ర మంత్రులు ధన్సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్ సహా మరికొందరు నేతలను ఇందుకోసం భాజపా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బుధవారం జరగనున్న పార్టీ శాసనపక్ష సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో ఈ సమావేశం జరగనుంది.
ధన్సింగ్ వైైపే మొగ్గు!
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ధన్సింగ్ రావత్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 48 ఏళ్ల ధన్సింగ్కు.. మర్యాదస్థుడిగా పేరు ఉంది. త్రివేంద్ర సింగ్ రావత్‌కు అత్యంత సన్నిహితుడు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరితో పాటు భాజపా జాతీయ ప్రతినిధి అనిల్ బలునీ, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అజయ్ భట్ పేర్లను సైతం అధిష్ఠానం పరిశీలనలో ఉంచినట్లు సమాచారం.
రాజీనామా