తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్న భాజపా' - భాజపాపై రాహుల్ గాంధీ

Rahul Gandhi News: భాజపా దేశాన్ని ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. దేశాన్ని రెండుగా విభజించి పేదలను అణచివేయాలని ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు.

rahul gandhi
రాహుల్ గాంధీ

By

Published : Feb 3, 2022, 10:15 PM IST

Rahul Gandhi News: కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. కేంద్రంపై మరోసారి విమర్శలు చేశారు. భాజపా ప్రభుత్వం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతోందని.. రాష్ట్రాలు, భాషలు, చరిత్రలపై తమ సిద్ధాంతాలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. పార్లమెంట్​లో బుధవారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. భాజపా దేశాన్ని రెండుగా విభజిస్తోందంటూ పునరుద్ఘాటించారు. ఛత్తీస్​గఢ్​ పర్యటనలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పేదలు భయపడతారని అనుకుంటున్నారు..

దేశాన్ని రెండుగా విభజించడం ద్వారా పేదలు బలహీనులై, ప్రశ్నించకుండా ఉంటారని కేంద్రం భావిస్తోందని.. కానీ పేదలు ఎవరికీ భయపడరని అన్నారు రాహుల్.

"నేను నిన్న లోక్​సభలో రెండు ఇండియాల గురించి చెప్పాను. దేశం ప్రస్తుతం 2-3 ప్రధాన సమస్యలు ఎదుర్కొంటోంది. భాజపా తన సిద్ధాంతాలతో ఈ దేశాన్ని పెను ప్రమాదంలోకి నెడుతోంది. అందులో మొదటి ప్రమాదం ఈ దేశాన్ని రెండుగా విభజించడం. ఒకటి పేదలకు, ఇంకోటి సంపన్నులకు. ఇప్పుడు జరిగిన దేశాభివృద్ధికి కారణం పేదలు, కార్మికులు, రైతులు. అంతే కానీ ఏ రాజకీయ పార్టీ కాదు. ఈ 70 ఏళ్లలో దేశాభివృద్ధి ఏం జరిగిందని మీరు ప్రశ్నిస్తే.. అది రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులకే అవమానం.. కాంగ్రెస్​ పార్టీకి కాదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

దేశంలోని 100 మంది సంపన్నుల దగ్గరే.. 40శాతం దేశ జనాభా వద్ద ఉన్న దానికన్నా ఎక్కువ సంపద ఉందని ఆరోపించారు.

ఛత్తీస్​గఢ్​ పర్యటన సందర్భంగా రాహుల్​ పలు ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాయ్​పుర్​లో యుద్ధస్మారకం సహా గాంధీ సేవగ్రామ్​ పేరుతో ఏర్పాటు చేయనున్న ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు.

ఇదీ చూడండి :చైనాపై భారత్ కన్నెర్ర- ఒలింపిక్స్ వేడుకల ప్రసారాలు బంద్​!​

ABOUT THE AUTHOR

...view details