బంగాల్లో భారతీయ జనతా పార్టీ(భాజపా) మద్దతుదారుడి భార్యను తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. హుగ్లీ జిల్లాలోని గోఘాట్ ప్రాంతంలో సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగిందని చెప్పారు.
కొందరు వ్యక్తులు సమూహంగా వచ్చి భాజపా కార్యకర్త ఇంట్లోకి చొరబడి, దాడి చేశారని అతడి కుటుంబీకులు చెప్పారు. ఈ క్రమంలో అతడి భార్య మదాబీ అదాక్ అడ్డుకోగా.. ఆమెను తీవ్రంగా గాయపరిచి పరారయ్యారని తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మరణించిందన్నారు.