ఒడిశా సీఎం(odisha cm news) నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై గుడ్లతో దాడి చేశారు భాజపా మద్దతుదారులు. పూరీలో రూ.331 కోట్ల హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్(naveen patnaik news today).. భువనేశ్వర్‌కు తిరిగి వెళ్తుండగా ప్రభుత్వ ఆసుపత్రి స్క్వేర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
కలహండి టీచర్ అపహరణ, హత్య కేసులో ప్రభుత్వం తీరుకు నిరసనగా కొందరు ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. జగన్నాథ ఆలయం ముందు ఉన్న గ్రాండ్ రోడ్‌పై పేడనీటిని చల్లి శుద్ధి చేశారు. అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన 'కళంకిత రాష్ట్ర మంత్రులు' పవిత్ర మార్గాన్ని అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు.
"ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని జయంత్ దాస్ నేతృత్వంలోని మా కార్యకర్తలు గుడ్లు విసిరారు. పట్నాయక్ తన మంత్రులపై చర్యలు తీసుకునే వరకు ఈ నిరసన కొనసాగుతుంది" అని భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు ఇరాసిష్ ఆచార్య భువనేశ్వర్‌లో విలేకరుల సమావేశంలో అన్నారు.